ప్రభుత్వ భూమి ఆక్రమణ.. తప్పుదోవ పట్టించేలా ఎమ్మార్వో నివేదిక
ముదిగొండ మండలం సువర్ణపురం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 417లో ప్రభుత్వ భూమి ఆక్రమణ గురికాగా అక్రమార్కులపై చర్యలు కానరావడం లేదు..
ముదిగొండ మండలం సువర్ణపురం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 417లో ప్రభుత్వ భూమి ఆక్రమణ గురికాగా అక్రమార్కులపై చర్యలు కానరావడం లేదు. గ్రామంలోని వెంకటగిరి టు వల్లభి ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ భూమి ఉండగా కొంతమంది ఈ భూమిని ఆక్రమించి ఫామ్ హౌస్, కోల్డ్ స్టోరేజ్‌లకు దారి ఏర్పాటు చేశారు. మరికొందరు పట్టా భూమిలో కలుపుకొని గోడ నిర్మాణం చేపట్టగా, ఇంకొందరు వెంచర్‌కు ప్రభుత్వ భూమి నుంచి దారి తీసుకున్నారు.
ఈ విషయమై దిశలో కథనం ప్రచురించగా తహసీల్దార్ స్పందించి, సర్వే చేపట్టి, అక్రమార్కులకు నోటీసులు జారీ చేశారు. కబ్జాదారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోయినా చర్యలు తీసుకోలేదు. ఈ విషయమై ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా పూర్తి నివేదిక పంపాలని తహసీల్దార్‌ను ఆదేశిస్తే.. సర్వేనెంబర్ 417లో 2.04 గుంటలు ఉండగా, 2ఎకరాలే ఉందని, వెంచర్లో ప్రభుత్వ భూమి కలవలేదని పేర్కొన్నారు. ఆక్రమించిన వారికి నోటీసులు ఇచ్చామని, ప్రభుత్వ భూమిలో రోడ్డు నిర్మాణం చేపట్టిన విషయమై తహసీల్దార్ పంపించిన నివేదికలో లేదు. ఉన్నతాధికారులను పక్కదారి పట్టించేలా తహసీల్దార్ నివేదిక ఇవ్వడంపై మండల ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- దిశ, ముదిగొండ
దిశ, ముదిగొండ: ముదిగొండ మండలం సువర్ణపురం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 417లో రెండు ఎకరాల నాలుగు గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమి వెంకటగిరి టు వల్లభి ప్రధాన రహదారి పక్కన ఉండటంతో ఆ భూమి పక్కనే ఉన్న కొంతమంది పట్టాదారులు కన్ను ప్రభుత్వ భూమిపై పడింది. ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఫామ్ హౌస్, కోల్డ్ స్టోరేజ్‌లకు దారి ఏర్పాటు చేశారు. మరొకరు ప్రభుత్వ భూమిని ఆక్రమించి, పట్ట భూమిలో కలుపుకొని గోడ నిర్మాణం చేశారు. ఇంకొకరు వెంచర్‌ను ఏర్పాటు చేసి, ఆ వెంచర్‌కు ప్రభుత్వ భూమి నుంచి దారి తీసుకున్నారు. కాగా ఈ విషయంపై దిశపత్రికలో వార్త ప్రచురించగా స్పందించిన తహసీల్దార్, ఆర్ఐ కలిసి అక్రమానికి గురైన భూమి పైకి వెళ్లి విచారణ జరిపారు. ప్రభుత్వ భూమి ఆక్రమించారని నిర్ధారణ చేశారు. ప్రభుత్వ భూమి ఆక్రమించిన అక్రమార్కులకు 7 నోటీస్‌లు జారీ చేశారు.
నోటీస్ జారీ చేసిన ఏడు రోజుల తర్వాత ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన, లేదా ప్రభుత్వ భూమిని కలుపుకున్న తొలగించాల్సిందిగా ఉంటుంది. ఏడు రోజుల్లోగా అక్రమార్కుల తొలగించకపోతే 15రోజులు ఎదురు చూసి మళ్లీ వారికి నోటీస్ ఇచ్చి సంబంధిత అధికారులే అక్రమ కట్టడాలను తొలగించి, ప్రభుత్వ భూమిని స్వాధీన పరుచుకోవాల్సి ఉంటుంది. కానీ అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనపై నెల రోజులు గడుస్తున్న క్రమంలో ప్రజావాణిలో కలెక్టర్‌కు దరఖాస్తు చేయగా.. ఈ విషయంపై పూర్తి నివేదిక పంపామని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్ కలెక్టర్‌కు నివేదిక పంపించాల్సి ఉండగా ఆ నివేదికలో సర్వేనెంబర్ 417లో 2:04 ఉండగా, 2ఎకరాలే ఉందని, వెంచర్లో ప్రభుత్వ భూమి కలవలేదని గతంలో డీఐ సర్వే నిర్వహించి నివేదిక ఇచ్చారని తహసీల్దార్, కలెక్టర్‌కు నివేదిక పంపించారు.
ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, ఆక్రమించిన వారికి నోటీసులు ఇచ్చామని, ప్రభుత్వ భూమిలో రోడ్డు నిర్మాణం చేశారని తహసీల్దార్ పంపించిన నివేదికలో లేదు. వీటన్నిటిని చూస్తుంటే స్థానిక తహసీల్దార్ అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులను పక్కదారి పట్టించేలా తాసిల్దార్ నివేదిక ఇవ్వడంపై మండల ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకపోతే 417సర్వే నెంబర్ లో ఉన్న 2:04 ప్రభుత్వ భూమి ఏమైందని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, తప్పుడు దోవ పట్టించేలా నివేదిక ఇచ్చిన తహసీల్దారుపై, ప్రభుత్వ భూమి ఆక్రమించిన అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మండల ప్రజలు కోరుతున్నారు.
ఆర్డీఓ ఏం చెప్పారంటే..
ముదిగొండ మండలంలోని న్యూ లక్ష్మిపురంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆర్డీఓను వివరణ కోరగా నోటీసులు ఇచ్చామని మూడు నాలుగు రోజుల్లోనే తీసేస్తారని తెలిపారు. గ్రివెన్స్‌లో ఫిర్యాదు చేయగా, తహసీల్దార్ పంపిన నివేదికలో భూమి విజిట్ చేసిన విషయం, నోటీసులు ఇచ్చినట్లు పేర్కోలేదని చెప్పగా.. నోటీసులు ఇచ్చారని చెప్పారు. రెండు నెలలైన చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా... మొన్న కూడా మాట్లాడమని సీజ్ చేస్తామని చెప్పారు.