స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మారుతి నర్సింగ్ కాలేజ్, లయన్స్ క్లబ్ భద్రాచలం వారి అధ్వర్యంలో ఎన్ ఆర్ ఐ వాసవి అసోసియేషన్ యూఎస్ఏ పుష్పగిరి కంటి ఆసుపత్రి సికింద్రాబాద్ వారి సహకారంతో మారుతి నర్సింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత నేత్ర శస్త్ర చికిత్స శిబిరం విజయవంతమైంది.
దిశ, భద్రాచలం : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మారుతి నర్సింగ్ కాలేజ్, లయన్స్ క్లబ్ భద్రాచలం వారి అధ్వర్యంలో ఎన్ ఆర్ ఐ వాసవి అసోసియేషన్ యూఎస్ఏ పుష్పగిరి కంటి ఆసుపత్రి సికింద్రాబాద్ వారి సహకారంతో మారుతి నర్సింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత నేత్ర శస్త్ర చికిత్స శిబిరం విజయవంతమైంది. ఈ కార్యక్రమంకు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొని 790 మందికి కంటి ఆపరేషన్లు, 11 వందల మందికి కంటి అద్దాలు ఇచ్చిన స్వచ్ఛంద సంస్థల సేవలను కొనియాడారు. అంధత్వ నివారణ కొరకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఈ కార్యక్రమానికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ చైర్మన్ డాక్టర్ ఎస్ ఎల్ కాంతారావు తదితరులు పాల్గొన్నారు.