భూమాత మాడ్యూల్ అమలుకు ముందే సమస్యలు పరిష్కరించాలి : కొత్తగూడెం కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న భూమాత పోర్టల్

Update: 2025-01-07 14:21 GMT

దిశ, కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న భూమాత పోర్టల్ అమలకు ముందు మాడ్యూల్ లో తలెత్తే సమస్యలు,వాటి పరిష్కారానికి తీసుకోవాలి అని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తో కలిసి ఆర్డీవోలు,తాసిల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూమాత మాడ్యూల్ అమలు లో భాగంగా పోర్టల్ లో తలెత్తే సమస్యలు,వాటి పరిష్కార మార్గాలకు తీసుకోవలసిన చర్యలను అందరూ తాసీల్దారులు లిఖితపూర్వకంగా నిర్దేశిత పట్టిక ద్వారా తెలియజేయాలని ఆదేశించారు.

వచ్చిన సూచనలు, సలహాలను ఉన్నతాధికారులకు పంపడం ద్వారా మాడ్యూల్ లో మార్పులు చేయడానికి అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న భూ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్ ఓ ఆర్ చట్టం, కొత్త చట్టం పై తహసీల్దార్లకు పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలు,మండలాల పరిధిలో ఉన్న అటవీ శాఖ భూముల వివరాలను అటవీ శాఖ గెజిటెడ్,రెవెన్యూ రికార్డులతో సరిచూసి ఏ సర్వే నెంబర్లు ఎంత అటవీ భూములు ఉన్నాయో గుర్తించాలని ఆదేశించారు. దీని ద్వారా మిగిలిన ప్రభుత్వ భూములను ఎయిర్ పోర్ట్, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్లు వంటి తదితర అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవచ్చు అని కలెక్టర్ తెలిపారు.


Similar News