పంట పొలాల్లోకి పొంగిపొర్లిన భక్త రామదాసు నీళ్లు
పంట పొలాల్లోకి భక్త రామదాసు నీళ్లు పొంగిపొర్లాయి. ఎస్సారెస్పీ నుంచి కాలువలకు నీళ్లు విడుదల చేసి ఒకవైపు నుంచి చెరువుల్లోకి, పంట పొలాలకు నీరు అందిస్తున్నారు.
దిశ, ఖమ్మం రూరల్ : పంట పొలాల్లోకి భక్త రామదాసు నీళ్లు పొంగిపొర్లాయి. ఎస్సారెస్పీ నుంచి కాలువలకు నీళ్లు విడుదల చేసి ఒకవైపు నుంచి చెరువుల్లోకి, పంట పొలాలకు నీరు అందిస్తున్నారు. అధికారులు ముందు చూపు లేకుండా మంగళవారం భక్త రామదాసు ఎత్తిపోతల పథకం రన్ చేయడంతో ఒకవైపు భక్త రామదాసు నీళ్లు మరోవైపు ఎస్సారెస్పీ నీళ్లు కాలువలకు ప్రహహించడంతో పొంగిపొర్లి పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి.
అధికారులు ముందు చూపు లేకపోవడంతో నీరు వృథా అయ్యి పంటలు కూడా దెబ్బతిన్నట్టు చింతపల్లి గ్రామ రైతులు వాపోతున్నారు. ఐబీ ఏఈ మంగళపూడి వెంకటేశ్వర్లును వివరణ కోరగా చింతపల్లి వద్ద కాలువ పూడిపోవడంతో గండిపడి నీరు పంట పొలాల్లోకి ప్రవహించిన మాట వాస్తవమేనని తెలిపారు. కాలువ మరమ్మతులు చేసిన తర్వాత నీటిని విడుదల చేస్తామని తెలిపారు.