మైనార్టీ స్కూల్లో ఏసీబీ రైడ్స్..పట్టుపడిన ప్రిన్సిపాల్ ..

ఇల్లందు మైనార్టీ పాఠశాల నందు గురువారం ఉదయం ఏసీబీ రైడ్స్

Update: 2025-01-09 05:50 GMT

దిశ, ఇల్లందు : ఇల్లందు మైనార్టీ పాఠశాల నందు గురువారం ఉదయం ఏసీబీ రైడ్స్ నిర్వహించారు. ఏసీబీ రైడ్స్ లో ఔట్సోర్సింగ్ నందు తెలుగు బోధిస్తున్న ఉపాధ్యాయురాలు సంధ్య రాణి నుండి ఆమె జీతం చేయడానికి పది రోజులుగా రూ.పదివేలు అడగడం జరిగింది. ఈరోజు ఉదయం ఆ ఉపాధ్యాయులు రూ. 2000లకు ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలపడం జరిగింది. ఉదయం ఏసీబీ అధికారులు పన్నిన పథకం ప్రకారం ఆ ఉపాధ్యాయురాలు ఉదయం 8 గంటల సమయంలో మైనార్టీ స్కూల్ ప్రిన్సిపాల్ భీమనపల్లి కృష్ణ కి రూ.2000 ఇవ్వగా ఆ డబ్బులు అటెండర్ కిచ్చెల్లి రామకృష్ణ ఇవ్వమని చెప్పగా ఆ ఉపాధ్యాయురాలు అటెండర్ కి ఇవ్వగా వెంటనే ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ వారి బృందం పాల్గొన్నారు.


Similar News