పర్యాటక ప్రాంతంగా ఖమ్మం ఖిల్లా అభివృద్ధి

ఖమ్మం ఖిల్లా పైకి వెళ్లేందుకు ఏర్పాటు చేయనున్న రోప్ వే, జాఫర్ బావి అభివృద్ధితో ఖమ్మం పర్యాటక ప్రాంతంగా మారుతుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.

Update: 2025-01-09 14:23 GMT

దిశ, ఖమ్మం : ఖమ్మం ఖిల్లా పైకి వెళ్లేందుకు ఏర్పాటు చేయనున్న రోప్ వే, జాఫర్ బావి అభివృద్ధితో ఖమ్మం పర్యాటక ప్రాంతంగా మారుతుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం ఖమ్మం ఖిల్లా ప్రాంతం పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడంలో భాగంగా జాఫర్ బావి పునరుద్ధరణతో పాటు, పర్యాటకులు సురక్షితంగా ఆహ్లాదకర వాతావరణంలో ఖిల్లా పైకి వెళ్లి సందర్శించే విధంగా రోప్ వే ఏర్పాటుకు కలెక్టర్ ఖిల్లా మెట్ల మార్గం ద్వారా అధికారులతో కలిసి ఖిల్లా పైకి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఖమ్మం ఖిల్లాకు రోప్ వే ఏర్పాటుకు అనువుగా ఉండే మార్గం, ఎక్విప్మెంట్, ఖమ్మం ఖిల్లాకు రావడానికి రోడ్డు అనుకూలత, పార్కింగ్, టాయిలెట్స్ ఏర్పాటుపై పరిసరాలను తిరిగి అధికారులకు పలు సూచనలు చేశారు.

    అంతకు ముందు జాఫర్ బావిని, బావి వైపు జరుగుతున్న అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ డా. శ్రీజతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖిల్లాపై పర్యాటక లకు ఆహ్లాదం కలిగే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మంత్రుల ఆదేశాల మేరకు ప్రజలకు అనుకూలంగా ఖిల్లాకు పూర్వ వైభవం వచ్చే విధంగా తీర్చిదిద్దుతామని అన్నారు. లైటింగ్, అనువైన పార్కింగ్ పనులు ప్రారంభిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో  కలెక్టర్ వెంట జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి, అర్బన్ తహసీల్దార్​ రవికుమార్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉన్నారు.


Similar News