హాట్ కేకుల్లా ఉత్తర ద్వార దర్శనం టికెట్స్

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 10 తేదీన నిర్వహించే ఉత్తర ద్వార దర్శనం వీక్షించడానికి రామాలయం అధికారులు ఆన్లైన్ లో ఉంచిన టికెట్స్ కు భక్తుల నుండి మంచి స్పందన లభించింది.

Update: 2025-01-08 14:23 GMT

దిశ, భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 10 తేదీన నిర్వహించే ఉత్తర ద్వార దర్శనం వీక్షించడానికి రామాలయం అధికారులు ఆన్లైన్ లో ఉంచిన టికెట్స్ కు భక్తుల నుండి మంచి స్పందన లభించింది. రూ. 2 వేలు విలువైన వీఐపీ టికెట్స్ 500 కు గాను 391 టికెట్స్ సేల్ అయ్యాయి. సెక్టార్ ఏ వెయ్యి రూపాయలు విలువ కలవి 215 ఉంచగా మొత్తం అమ్ముడుపోయాయి. రూ. 500 విలువ కల టికెట్స్ 950 ఆన్లైన్ లో ఉంచగా 475 టికెట్స్ సేల్ అయ్యాయి. ఇంకా ఒక రోజు టైమ్ ఉండటంతో మొత్తం టికెట్స్ అమ్ముడుపోయే అవకాశం ఉంది.  


Similar News