అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి : ఎమ్మెల్యే కూనంనేని

తెలంగాణ రాష్ట్రం లో అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ కు కనీస

Update: 2025-01-07 13:08 GMT

దిశ,కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రం లో అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ కు కనీస వేతనం రూ.18 వేలు ఇస్తామన్న హామీ అమలు చెయ్యాలి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం ఐడీఓసీ కార్యాలయం ఎదుట జరిగిన అంగన్వాడీ కార్యకర్తల ధర్నా లో పాల్గొని మాట్లాడుతూ..అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం కు అధిక నిధులు కేటాయింపులు చేయాలి అని పక్కా భవనాలు, విద్యుత్ , మరుగు దొడ్లు , త్రాగు నీరు , ఆట బొమ్మలు , రూమ్స్ లో రంగులు ,ఏర్పాటు చేసి అంగన్వాడీ కేంద్రాలు అభివృద్ధి చెయ్యాలి అని అన్నారు. ఇంటి అద్దె లు ,గ్యాస్ బిల్స్ , ఇతర పెండింగ్ బిల్స్ , మినీ టీచర్స్ పదోన్నతి ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత జీతం రూ.7,500 నుండిరూ. 13,650  పెంచి అమలు పర్చకుండా గత 9 నెలలు నుండి మినీ టీచర్ గౌరవ వేతనం మాత్రమే అందిస్తున్నారు అని అన్నారు. తక్షణం అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలు ప్రభుత్వం సానుభూతి తో ఆలోచన తో పెండింగ్ మినీ టీచర్స్ వేతనాలు అందించాలి అని,కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఐసిడిఎస్ కు నిధులు పెంచాలి అని అంగన్వాడీ సెంటర్స్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు పెంచాలి అని ఖాళీగా ఉన్న ఆయా టీచర్ పోస్టులు భర్తీ చేయాలి, మెనూ ఛార్జి లు పెరుగుతున్న ధరలు ప్రకారం పెంచాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ , జిల్లా అధ్యక్షులు కంచెర్ల జమలయ్య , అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గొనె మణి , కార్యదర్శి రెడ్డి అరుణ , నాయకులు భూక్యా లలిత , వేల్పుల మల్లికార్జున , బండి నాగేశ్వర రావు , అన్నరపు వేంకేటేశ్వర్లు , వెంకట్రావు , నిమ్మల రాంబాబు , విజయ , వినోద , శ్రీ లత , సరోజ , ఇంద్ర , నాగలక్ష్మి , సావిత్రి , సంధ్య , మాధవి , రమాదేవి ,విజయలక్ష్మి , సునీత, వరుణ్ , తదితరులు పాల్గొన్నారు .


Similar News