కృష్ణావతారంలో భద్రాద్రి రామయ్య
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ
దిశ,భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి.అందులో భాగంగా శ్రీ స్వామి వారు 9 వ రోజు బుధవారం కృష్ణావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. కృష్ణావతారంలో ఉన్న రామయ్యను వేలాది మంది భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, భక్తుల కోలాటాల నడుమ రాజ వీధిలో తిరువీధి సేవ నిర్వహించారు. స్వామి వారికి భక్తులు మంగళ హారతులతో నీరాజనాలు పలికారు.