వరద బాధితులకు ఎంపీ కోటి విరాళం

ఖమ్మం జిల్లాలో పారిశ్రామికవేత్తగా హెరిటో సంస్థను నెలకొల్పి తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఖండాంతరాలకు విస్తరింపజేసిన రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారధి రెడ్డి ముంపు వాసులకు కోటి రూపాయల విరాళం ఇచ్చారు.

Update: 2024-09-05 16:06 GMT

దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం జిల్లాలో పారిశ్రామికవేత్తగా హెరిటో సంస్థను నెలకొల్పి తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఖండాంతరాలకు విస్తరింపజేసిన రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారధి రెడ్డి ముంపు వాసులకు కోటి రూపాయల విరాళం ఇచ్చారు. మున్నేరు విపత్తు వల్ల నష్టపోయిన వారికి అందేలా జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ కి గురువారం చెక్కును అందించారు. జిల్లాకు ఏ విపత్తు, ఏ ఆపద సంభవించినా తాను ఉన్నానంటూ ఆపన్న హస్తం అందిస్తానన్నారు. గతంలో కూడా ఖమ్మం జిల్లాకు వరదలు సంభవించినప్పుడు కోటి రూపాయలు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.

    అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రాంతాలలో వరదలు వచ్చినప్పుడు అక్కడ కలెక్టర్ కు కూడా రూ. కోటి విరాళం అందజేశారు. ఆయన కుమార్తె జ్ఞాపకార్థం అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునికంగా హైదరాబాద్​లో నిర్మించిన సింధు హాస్పిటల్ వైద్య బృందాలను, మందులను కలెక్టర్ అందుబాటులో ఉంచి వరద ప్రభావంగా వచ్చే వ్యాధులను అరికట్టే విధంగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు ప్రతి రాష్ట్రానికి కోటి రూపాయలు చొప్పున రెండు కోట్ల రూపాయలను విరాళంగా అందజేస్తున్నట్లు తెలిపారు. 

Tags:    

Similar News