సింగరేణి మైదానంలో కబడ్డీ కూత

రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Update: 2024-10-28 16:18 GMT

దిశ, కొత్తగూడెం రూరల్ : రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు సింగరేణి ప్రకాశం స్టేడియం గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణలు టాస్ వేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ క్రీడా పోటీలు ఆరోగ్యానికి చిరునామా గా నిలుస్తాయని పేర్కొన్నారు. పోటీలో విజయాలు సాధిస్తే ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి అన్నారు. కబడ్డీ రంగానికి మంచి క్రేజ్ ఉందని ఇందులో రానిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు.

ప్రతి ఏడాది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన సందర్భంగా కొత్తగూడెం సింగరేణి మైదానంలో క్రీడా పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, మంత్రి క్యాంపు కార్యాలయ ఇంచార్జి దయాకర్ రెడ్డి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ చీకటి కార్తీక్, మాజీ జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, టీపీసీసీ సభ్యులు నాగ సీతారాములు, మహిళా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ళ మురళి, నాగేంద్ర త్రివేది, తూము చౌదరి, వూకంటి గోపాల్ రావు, జెవిఎస్ చౌదరి, డీసీఎంస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంత్ రావు, విజయ బాయ్, యర్రంశెట్టి ముత్తయ్య, ఐఎన్టీయూసీ రజాక్, పీతాంబరం, మహిపతి రామలింగం, పెదబాబు తదితరులు పాల్గొన్నారు.








Similar News