మావోయిస్టుల డంప్ స్వాధీనం.. భారీ స్మారక స్థూపం కూల్చివేత

ఛతిస్గడ్ భీజ్జీ పోలీస్ స్టేషన్, సుక్మా జిల్లాలో భద్రతా దళాలు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి

Update: 2025-03-19 12:56 GMT
మావోయిస్టుల డంప్ స్వాధీనం.. భారీ స్మారక స్థూపం కూల్చివేత
  • whatsapp icon

దిశ, భద్రాచలం : ఛతిస్గడ్ భీజ్జీ పోలీస్ స్టేషన్, సుక్మా జిల్లాలో భద్రతా దళాలు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. పోలీస్ స్టేషన్ భీజ్జీ ప్రాంతంలోని డాంటెష్‌పురం ఫారెస్ట్ హిల్ ప్రాంతంలో నక్సలైట్స్ దాచిన ఒక బిజిఎల్ లాంచర్, 12 బోర్ రైఫిల్ రెండు రౌండ్లు, 55 జెలటిన్ స్టిక్స్ డంప్ ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఛత్తీస్ ఘఢ్ బీజాపూర్ జిల్లా, ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమవరం గ్రామంలో మావోయిస్టులు నిర్మించిన భారీ స్మారక స్థూపాన్ని భద్రతా బలగాలు జేసీబీ తో కూల్చి వేశారు.


Similar News