వరద బాధితులకు బీజేపీ అండగా ఉంటుంది

మున్నేరు వరద బాధితులకు భారతీయ జనతా పార్టీ తమ వంతు సహాయంగా ముంపు ప్రాంతాలలో భోజనం, దుస్తులు పంపిణీ చేశామని పార్లమెంట్ అభ్యర్థి వినోద్ రావు తెలిపారు.

Update: 2024-09-05 11:15 GMT

దిశ బ్యూరో, ఖమ్మం : మున్నేరు వరద బాధితులకు భారతీయ జనతా పార్టీ తమ వంతు సహాయంగా ముంపు ప్రాంతాలలో భోజనం, దుస్తులు పంపిణీ చేశామని పార్లమెంట్ అభ్యర్థి వినోద్ రావు తెలిపారు. గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గల్ల సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్నేరు ఉపద్రవంతో గత 100 సంవత్సరాలలో లేనంతగా నష్టం వాటిల్లిందన్నారు. వరద బాధితులకు బీజేపీ తరఫున తోచినంత సహాయం చేశామని అన్నారు. రాజీవ్ గృహకల్ప, మోతీనగర్, బొక్కలగడ్డ వెంకటేశ్వర్ నగర్, ప్రకాష్ నగర్ వంటి ప్రాంతాలలో పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.

    కరుణగిరి ప్రాంతంలో పెద్ద గుట్ట ఉండేదని అక్కడ రాజీవ్ గృహాలను నిర్మించడానికి గుట్టలను తొలగించారని, దీంతో అక్కడ నివసించే వారికి రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. మున్నేరు వరదలు గురించి తెలుసుకునేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఖమ్మం వస్తున్నారని, ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు వరదలు వచ్చిన వెంటనే రాజకీయాలకు అతీతంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి ఫోన్ చేసి వరద పరిస్థితి తెలుసుకున్నారని ,ప్రధాని మోడీ, హోంమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి రాష్ట్రానికి అన్ని విధాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు, దొంగల సత్యనారాయణ, శ్యామ్ రాథోడ్, నున్నా రవి, నెల్లూరి కోటేశ్వరరావు, చావ కిరణ్, రవి రాథోడ్, దుద్దుకురి కార్తీక్, తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News