ఇన్ఫార్మర్ నెపంతో హత్యలపై ఆదివాసీల మండిపాటు
ఇన్‌ఫార్మర్ పేరుతో మావోయిస్టులు వరుస హత్యలకు పాల్పడటంతో ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
దిశ, భద్రాచలం : ఇన్‌ఫార్మర్ పేరుతో మావోయిస్టులు వరుస హత్యలకు పాల్పడటంతో ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు సోమవారం అన్ని గిరిజన సంఘాలు ఒకే తాటిమీదకు వచ్చి అత్యవసర సమావేశం నిర్వహించారు. అక్టోబరు 04న బోడ్‌కెల్‌కు చెందిన బార్సే ఎర్రా ను ఇన్ఫర్మార్ నెపంతో మావోలు హత్య చేశారు. అక్టోబర్ 05న న మృతుడి సోదరుడు బర్సే భీమా ను కిడ్నాప్ చేశారు. గిరిజన సంఘాలు ఏకమై హత్య, కిడ్నాప్‌ను ఖండించారు. నక్సలైట్లు కిడ్నాప్ చేసిన గ్రామస్థులను విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం అన్ని గిరిజన సంఘాల అధినేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు.