ప్రజల పక్షం...దిశ పత్రిక
నిమిషాల్లో వార్తలు అందిస్తూ, పత్రికా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన 'దిశ' దినపత్రిక ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు.
దిశ, కొత్తగూడెం : నిమిషాల్లో వార్తలు అందిస్తూ, పత్రికా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన 'దిశ' దినపత్రిక ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. గురువారం ఆయన ఐడీఓసీలో 'దిశ --2025' క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...'దిశ పత్రిక' సంచలన కథనాలను ప్రచురిస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ రాష్ట్రంలోనే విశేషమైన గుర్తింపు పొందిందని కొనియాడారు. దిశ పత్రికలో సంచలనాత్మకమైన కథనాలను అందించి పత్రిక ని అగ్రస్థానంలో నిలిపిన సిబ్బందికి ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కొత్తగూడెం రిపోర్టర్ శివ శంకర్, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.