CM Revanth: పోలవరం నిర్మాణంతో భద్రాద్రి ఆలయానికి ఏర్పడే ముప్పేంటి?

నీటిపారుదల శాఖ అధికారుల(Irrigation Department Officials)తో సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు.

Update: 2025-01-04 10:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: నీటిపారుదల శాఖ అధికారుల(Irrigation Department Officials)తో సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటి పారుద‌ల శాఖ‌) ఆదిత్యనాథ్ దాస్(Adityanath Das) హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram project) నిర్మాణంతో తెలంగాణపైన పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ టీంతో నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయించాలని ఆదేశించారు. ఐఐటీ హైదరాబాద్ టీంతో కో-ఆర్డినేషన్ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. పోలవరం నిర్మాణంతో భద్రాచలం దేవాలయానికి ఏర్పడే ముప్పుపైనా సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు.

2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైనట్లు అధికారులు సీఎంకు వివరించారు. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన గోదావరి బన‌కచర్ల ప్రాజెక్టు(Banakacherla project) అంశాన్ని కూడా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్‌పైన ఇటీవల ఏపీ ప్రభుత్వం(AP Govt) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని.. వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు సీఎంకు తెలియ‌జేశారు. దీంతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(AP Chief Secretary)కి తెలంగాణ అభ్యంతరాలను తెలపాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుతో పాటు కేంద్ర జల్‌ శక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Tags:    

Similar News