Aakunuri Murali : విద్యను సర్వ నాశనం చేసింది కేసీఆర్ కాదా? : ఆకునూరి మురళి

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddyతో కాదని.. బీఆర్ఎస్(BRS)కు విద్య(Education)ను అప్పగించాలంటూ(Handed Over) ఆ పార్టీ నాయకుడు, మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్(R.S. Praveen Kumar) చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా రిటైర్డు ఐఏఎస్ ఆకునూరి మురళి(Aakunuri Murali)కౌంటర్ వేశారు.

Update: 2025-01-06 10:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddyతో కాదని.. బీఆర్ఎస్(BRS)కు విద్య(Education)ను అప్పగించాలంటూ(Handed Over) ఆ పార్టీ నాయకుడు, మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్(R.S. Praveen Kumar) చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా రిటైర్డు ఐఏఎస్ ఆకునూరి మురళి(Aakunuri Murali)కౌంటర్ వేశారు. బీఆర్ఎస్ కు విద్యను అప్పచెప్పాలా ? విద్యను సర్వ నాశనం చేసింది కేసీఆర్ ఆర్ కాదా? అని మురళి మండిపడ్డారు. కేసీఆర్ పాలన స్వర్ణయుగమా ? మరి నీ పాత స్టేట్మెంట్లు చూడు ఒకసారి..జోకర్ అవుతున్నావు ప్రవీణ్ నీవు అంటూ చురకలేశారు.

గింతగనం దిగజారుతావు అనుకోలేదని, ఐపీఎస్ పరువు నిలబెట్టు అని హితవు పలికారు. అధికారం కొరకు గిట్లాంటి అబద్దపు చెత్త రాజకీయాలు చెయ్యాలా? ఎవడి దగ్గర నేర్చుకుంటున్నావు ఈ ఫాల్తూ రాజకీయాలు.. నవ్వుకుంటున్నారు ఎట్లాంటి ప్రవీణ్ ఎట్లా అయ్యిండని.. అని ఆకునూరి మురళి మండిపడ్డారు. అలాగే ఈ మాటలు చెప్పినందుకు నా మీదకు అబద్దాలతో దింపు నీ పింకీ సోషల్ మీడియా పెయిడ్ బ్యాచ్ ను అంటూ కూడా మురళి వ్యంగ్యాస్త్రాలు వేశారు.

Tags:    

Similar News