వామనావతారంలో భద్రగిరీషుడు
వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా శనివారం భద్రగిరీషుడు రామయ్య వామనావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.
దిశ, భద్రాచలం : వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా శనివారం భద్రగిరీషుడు రామయ్య వామనావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. వామనావతార రూపుడు అయిన రామయ్యను వేలాది మంది భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి తిరువీధి సేవ నిర్వహించగా అడుగడుగునా భక్తులు మంగళ నీరాజనాలు పలికారు. వైకుంఠ ద్వారం ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.