నర్సింగ్ సిబ్బంది సేవలు మరువలేనివి.. కలెక్టర్ జితేష్ వి.పాటిల్.

నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైనదని, నర్సింగ్ సిబ్బంది సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు.

Update: 2025-01-06 08:54 GMT

దిశ, కొత్తగూడెం : నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైనదని, నర్సింగ్ సిబ్బంది సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. సోమవారం ఐఎంఎ హాల్ లో ఇటీవల ఉద్యోగోన్నతి పొందిన నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ -1, గ్రేడ్-2 హెడ్ నర్సుల అభినందన సభలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ఒత్తిడితో రోగులకు అందుబాటులో ఉంటూ, రోగులకు సేవ చేస్తూ, రోగికి వైద్యునికి మధ్య అనుసంధానంగా వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సింగ్ సిబ్బంది సేవలను ఆయన కొనియాడారు.

ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా కూడా రోగికి వైద్యం అందించడమే లక్ష్యంగా సేవలు అందిస్తున్న నర్సులను ఆయన ప్రశంసించారు. వృత్తిలో భాగంగా ఎటువంటి సమస్యలు ఉన్నా తానున్నానని వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, జిల్లాలోని టీవీవీపీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ రాధా రుక్మిణి, డాక్టర్ సునీల్ మజ్నేకర్, డాక్టర్ హర్షవర్ధన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధా మోహన్ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


Similar News