చదువు మరిచి చెడు వ్యసనాలకు బానిసవుతున్న యువత..

నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదం పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలకు చెప్తుండేవారు.

Update: 2025-01-02 09:25 GMT

దిశ, దుమ్ముగూడెం : నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదం పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలకు చెప్తుండేవారు. కానీ ఇప్పుడు చదువు మరిచి చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. 16 సంవత్సరాలు నిండని విద్యార్థులే ఉండడం గమనార్హంగా మారింది. వీరిలో ఎక్కువగా 8, 9, 10వ తరగతులతో పాటు ఇంటర్ చదివే విద్యార్థులె మద్యం, ధూమపానానికి బానిసలవుతున్నారు. మైనర్ యువకులు ఉండడం దుమ్ముగూడెం మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దుమ్ముగూడెం మండలంలోని నర్సాపురం, తురుబాక, అలాగే పలు పంచాయతీల్లో ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లు, అంగన్వాడి కేంద్రాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. కొంత మంది యువత ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని కష్టపడుతుంటే, చాలా మంది యువత మాత్రం ఎటువంటి లక్ష్యం లేకుండా సెల్ ఫోన్లు, మద్యం, ధూమపానం మత్తుపదార్థాలను బానిసలుగా మారుతున్నారు. మరికొందరు సరదాల కోసం మందు తాగుతూ, సిగరెట్టు కాల్చుతూ, ప్రమాదకరంగా వాహనాలు నడుపుతూ విచ్చలవిడితనం ప్రదర్శిస్తున్నారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక, విద్య నేర్పే గురువుల భయం లేక యువత పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది.

తల్లిదండ్రుల పర్యవేక్షణ ఏమైంది...?

నేటి తరం విద్యార్థుల పై తల్లిదండ్రులు దృష్టి పెట్టకపోవడంతో సరదా కోసం చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. అంతే కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడనిదే ఆ రోజు గడవట్లేదు. స్మార్ట్ ఫోన్, చెడు వ్యసనాలకు అలవాటుపడి తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక యువత చేడుదారిలో వెళ్తున్నట్లు తెలుస్తోంది.

చదువు మధ్యలోనే ఆపేసిన వారు ఎందరో..

యువత రోజు రోజుకు చెడు అలవాట్లకు చాలా తొందరగా అలవాటు పడి. ముఖ్యంగా మద్యపానం, ధూమపానానికి బానిసలవుతున్నారు. దుమ్ముగూడెం మండలంలో చాలామంది యువత ఇంటర్, డిగ్రీ డిస్కంటిన్యూ చేసి కూలి పనులకు వెళ్తున్నారు. అంతే కాకుండా మరిన్ని చెడు అలవాట్లతో తమ జీవితాలను చేతులారా పాడు చేసుకుంటున్నారు. చెడు అలవాట్ల వల్ల అదే యువత అనవసరమైన వాటికి బానిసలవుతున్నారు. వీరిలో చాలా మంది కాలేజీకి వెళ్లే విద్యార్థులు, యువత ఎక్కువగా ఉండటం విచారకరం.

స్పెషల్ ఫోకస్ పెట్టాం... బొడ్డు అశోక్, దుమ్ముగూడెం సీఐ

గ్రామీణ ప్రాంతాల్లోని యువత పై తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. యువత దారి తప్పి ప్రవర్తిస్తే వారిని సరైన మార్గంలో పెట్టుకోవాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

Read More : Health : స్మోకర్స్‌కి అలర్ట్ ..! మీరు తాగే ఒక్కో సిగరెట్ 22 నిమిషాల ఆయుష్షును తగ్గిస్తుంది!


Similar News