కొత్తగూడెంలో బీఆర్ ఎస్ కు భారీ షాక్.. కాంగ్రెస్ లోకి కీలక నాయకుడు

Update: 2024-08-09 09:42 GMT
కొత్తగూడెంలో బీఆర్ ఎస్ కు భారీ షాక్.. కాంగ్రెస్ లోకి కీలక నాయకుడు
  • whatsapp icon

దిశ, కొత్తగూడెం : కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. బీ ఆర్ ఎస్ నాయకుడు కనుకుంట్ల శ్రీనివాస్ ( కేకే) మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షం లో శుక్రవారం కాంగ్రెస్ క్యాంప్ ఆఫీస్ లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న కనుకుంట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బిఆర్ఎస్ పార్టీలో కలకలం రేపు తుంది. జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఆళ్ల మురళి ఆధ్వర్యంలో కనుకుంట్ల శ్రీనివాస్ తో పాటు ఆయన అనుచరులు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీలో జాయిన్ అయిన వారిలో మున్సిపల్ కౌన్సిలర్ మోర రూప, మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ కనుకుంట్ల పార్వతి, పోస్ట్ ఆఫీస్ వాసు, మాజీ బీ ఆర్ ఎస్ మహిళా టౌన్ ప్రెసిడెంట్ గాయత్రి, మోహనా చారి, మున్నా, ఈశ్వర్ , కొసన సంధ్య, గుడివాడ రాము, ఆదిలక్ష్మి,సంగీత్,చింటూ, త్రిమూర్తులు,కనుకుంట్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News