Telangana Police: న్యూఇయర్ విషెస్ పేరుతో వచ్చే లింక్స్‌తో జాగ్రత్త
నూతన సంవత్సర వేడుకల(New Year Celebrations) సందర్భంగా తెలంగాణ ప్రజలకు పోలీస్ శాఖ(Telangana Police) కీలక హెచ్చరికలు జారీ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: నూతన సంవత్సర వేడుకల(New Year Celebrations) సందర్భంగా తెలంగాణ ప్రజలకు పోలీస్ శాఖ(Telangana Police) కీలక హెచ్చరికలు జారీ చేసింది. న్యూఇయర్ పేరుతో వచ్చే లింక్స్‌ను క్లిక్ చేయొద్దని.. జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది. అవగాహన లేకుండా లింక్స్‌ను క్లిక్ చేస్తే మోసపోవడం ఖాయమని హెచ్చరించారు. తెలియని నెంబర్ల నుంచి వచ్చే మెసేజుల పట్ల తప్పకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరిని బలి చేద్దామా? అని సైబర్ నేరగాళ్లు(Cyber Links) రెడీగా ఉంటారని.. వారి ఉచ్చులో పడొద్దని అన్నారు.
అంతేకాదు.. న్యూఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ విధించిన నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ముఖ్యంగా ఇతరులకు ఇబ్బంది కలిగేలా, ఇతరుల మనోభావాలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయొద్దని తెలిపారు. పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మద్యం తాగి రోడ్లపైకి వచ్చినా, మైనర్లకు వాహనాలు ఇచ్చినా కఠిన చర్యలు తప్పవని అన్నారు.