Nagoba Jathara : నాగోబా జాతరకు ముహూర్తం ఖరారు

దేశంలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ గిరిజన నాగోబా జాతర(Nagoba Jathara)కు ముహూర్తం ఖరారైంది.

Update: 2025-01-03 11:47 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేశంలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ గిరిజన నాగోబా జాతర(Nagoba Jathara)కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న మహాపూజతో జాతర ప్రారంభం కానున్నట్టు మెస్రం వంశీయులు పేర్కొన్నారు. ఆదిలాబాద్(Adilabad) జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌(Keslapur) గ్రామంలో ప్రతి ఏడూ వచ్చే పుష్య అమావాస్య రోజున జాతర ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి 5 రోజుల పాటు జాతర ఘనంగా జరుగుతుంది. ఈ జాతరలో కీలమైన మూడోరోజు నిర్వహించే గిరిజన దర్బార్‌ ఈ నెల 31న జరగనుంది. జాతర ఏర్పాట్లకు సంబంధించి గురువారం జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా, ఉట్నూరు ఐటీటీఏ పీవో ఖుష్బూగుప్తా, ఎస్పీ గౌష్‌ ఆలం, సబ్‌ కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్ ఇతర అధికారులు కేస్లాపూర్‌లో సమావేశమయ్యి, చర్చించారు. ఈసారి రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలను జాతరకు ఆహ్వానించాలని నిర్ణయించారు. జాతర పూర్తయ్యే వరకు కేస్లాపూర్‌ చుట్టుపక్కల 5 కి.మీ.ల పరిధిలో మద్యం విక్రయాలపై నిషేధం విధించనున్నారు. గురువారం నెలవంక దర్శనమివ్వడంతో తొలిఘట్టంగా ఏడు రోజుల పాటు సాగే ప్రచార రథం శుక్రవారం కేస్లాపూర్‌లో బయలుదేరనుంది.

Tags:    

Similar News