రైతు రుణమాఫీ ఒకే సంవత్సరంలో పూర్తి చేయడం ఒక చరిత్ర: అద్దంకి దయాకర్

తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఆర్థిక సంవత్సరంలో రైతు రుణమాఫీ పూర్తి చేయడం చరిత్రలో నిలిచిపోతుందని.. కాంగ్రెస్ పార్టీ నేత అద్దంకి దయాకర్ అన్నారు.

Update: 2025-01-05 11:28 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఆర్థిక సంవత్సరంలో రైతు రుణమాఫీ(Farmer loan waiver) పూర్తి చేయడం చరిత్రలో నిలిచిపోతుందని.. కాంగ్రెస్ పార్టీ నేత అద్దంకి దయాకర్(Adnakidayakar) అన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం(CM Revanth Reddy Govt) నిలిచిందని.. కాంగ్రెస్ మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఫైర్ అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతులను దోచుకున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ఇంత చేస్తున్నా బీఆర్ఎస్ విమర్శించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప మరోటి తెలియదని ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ చెప్పుకొచ్చారు. కాగా శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు, సన్న బియ్యం పంపిణీ, రైతు భరోసా 12 వేల అమలుకు ఆమోదం తెలిపారు. కాగా రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని.. ఎన్నికల సమయంలో 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత 12 వేలు మాత్రమే ఇస్తామని చెప్పడంపై బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.


Similar News