PCC Chief Mahesh Kumar Goud : కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కి కట్టుబడి ఉన్నాం : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్(Kamareddy BC Declaration) అమలుకు కట్టుబడి(Committed) ఉన్నామని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ బీ. మహేష్ కుమార్ గౌడ్(PCC Chief Mahesh Kumar Goud)స్పష్టం చేశారు.

Update: 2025-01-03 11:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్(Kamareddy BC Declaration) అమలుకు కట్టుబడి(Committed) ఉన్నామని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ బీ. మహేష్ కుమార్ గౌడ్(PCC Chief Mahesh Kumar Goud)స్పష్టం చేశారు. రవీంద్ర భారతిలో బీసీ మహిళ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే 194 వ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల్లో నివాళులు అర్పించి మాట్లాడారు. మహిళల విద్యా ప్రదాత సావిత్రి బాయి పూలే దేశంలో మొదటి మహిళా పాఠశాల స్థాపించి దళిత, అణగారిన వర్గాలకు విద్యానందించిన మహిళ ఉపాధ్యాయురాలని కీర్తించారు. రాష్ట్రంలో ఏదైనా యూనివర్సిటీకి జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే పేర్లను పెట్టేందుకు కృషి చేస్తామన్నారు.

కాగా బీసీల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం అనైతికమని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బీసీలను పదేళ్లదో మోసం చేసి నిట్ట నిలువునా ముంచిన బీఆర్ఎస్ నేతలు బీసీల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. విద్య, వైద్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దూర దృష్టితో ముందుకెళ్తుందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కార్పొరేషన్ కైనా నిధులు కేటాయించారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు సవాలు చేస్తున్నానని.. బీసీ బిడ్డను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసే సత్తా ఉందా? అని నిలదీశారు. కుల సర్వే కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, తెలంగాణలో కుల గణన సర్వేపై దేశ వ్యాప్తంగా చర్చ జరగుతుందన్నారు.

బీసీ బిడ్డలుగా కాంగ్రెస్ లో పోరాడుతున్నామని, కులాలకు అతీతంగా ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీలో ఉందని, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలో ప్రశ్నించే స్వేచ్ఛ ఉంటుందా? అని ప్రశ్నించారు. జ్యోతిరావు పూలే తరువాత మరొక పూలే రాహుల్ గాంధీ అని, కేంద్ర ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్త శుద్ధి ఉంటే కుల గణన సర్వే చేసి తీరాలని డిమాండ్ చేశారు.ఫాం హౌస్ లో పడుకున్న వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎందుకని? ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, సామాజిక న్యాయం అమలులో అన్ని పార్టీలకంటే ముందుంటుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News