Formula E-Race Case: కేటీఆర్‌కు ACB నోటీసులు

ఫార్ములా ఈ-రేస్ కేసు(Formula E-Race Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2025-01-03 11:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేస్ కేసు(Formula E-Race Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)కు ఏసీబీ(ACB) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని శుక్రవారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. కేటీఆర్‌తో పాటు బీఎల్‌ఎన్ రెడ్డి(BLN Reddy), అర్వింద్ కుమార్‌(Arvind Kumar)లకు కూడా నోటీసులు జారీ చేశారు. కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత వారిని విచారించనున్నట్లు సమాచారం.

మరోవైపు ఈ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్న హెచ్‌ఎండీఏ విశ్రాంత చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. గడువు కావాలని ఈమెయిల్ పంపారు. దాంతో వారిద్దరి విచారణను తాత్కాలికంగా వాయిదా వేసి కొత్త తేదీలతో ఈడీ అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఫార్ములా-ఈ రేసు నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం లేకుండా, ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే నిధులు మళ్లించారన్న ఆరోపణపై మాజీ మంత్రి కేటీఆర్, హెచ్‌ఎండీఏ పూర్వ కమిషనర్‌ అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ విశ్రాంత చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిలపై అవినీతి నిరోధకశాఖ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News