RR Court: మైనర్‌పై లైంగికదాడి.. కోర్టు సంచలన తీర్పు
మైనర్(Minor)పై లైంగికదాడి కేసు(Sexual Assault Case)లో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కోర్టు(Rangareddy Court) సంచలన తీర్పు వెలువరించింది.
దిశ, వెబ్‌డెస్క్: మైనర్(Minor)పై లైంగికదాడి కేసు(Sexual Assault Case)లో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కోర్టు(Rangareddy Court) సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఎల్బీనగర్ ప్రాంతంలోని సరూర్‌నగర్‌లో ఉండే మైనర్‌పై.. అదే ప్రాంతంలో నివాసం ఉండే అంజయ్య అనే వ్యక్తి కన్నేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు వచ్చాక బాలిక అసలు విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తాజాగా.. జీవిత ఖైదుతో పాటు కోర్టు రూ.30 వేల జరిమానా విధించింది. అంతేకాదు.. బాధితురాలికి రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.