ఘోర రోడ్డు ప్రమాదం...ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

మేడ్చల్ చెక్​పోస్టు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2025-01-05 11:06 GMT

దిశ,మేడ్చల్ టౌన్ : మేడ్చల్ చెక్​పోస్టు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టీవీఎస్ వాహనంపై వెళ్తున్న నలుగురిని వెనుక నుండి లారీ ఢీ కొట్టింది. దాంతో కింద పడిపోయిన వారి పైనుండి లారీ దూసుకెళ్లడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరి కాళ్లపై నుండి లారీ దూసుకెళ్లింది. దాంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. బాధితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  


Similar News