సీఎంఆర్ కళాశాల ఘటనలో ఇద్దరు అరెస్ట్

గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని CMR కాలేజీ హాస్టల్ బాత్రూం వీడియోల కేసులో మేడ్చల్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Update: 2025-01-05 10:29 GMT

దిశ,మేడ్చల్ టౌన్ : గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని CMR కాలేజీ హాస్టల్ బాత్రూం వీడియోల కేసులో మేడ్చల్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆదివారం బీహార్ కు చెందిన కిశోర్, గోవింద్ లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వీరు దురుద్దేశపూర్వకంగా అమ్మాయిల బాత్రూంలోకి తొంగిచూసినట్లు, విద్యార్థినులను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాలేజీ చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డి, వార్డెన్ ప్రీతిరెడ్డితో సహా ఏడుగురిపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. 


Similar News