BRS: మీ మొదటి హామీ నీటిమీది రాతే అయ్యింది.. హరీష్ రావు సంచలన ట్వీట్

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో(CM Camp Office) ప్రతిరోజూ ప్రజాదర్బార్(Praja Dharbar) నిర్వహిస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో(Congress Menifesto) డబ్బా కొట్టారు.. ఏమైందని మాజీమంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao Thanneeru) ప్రశ్నించారు.

Update: 2025-01-03 12:24 GMT

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో(CM Camp Office) ప్రతిరోజూ ప్రజాదర్బార్(Praja Dharbar) నిర్వహిస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో(Congress Menifesto) డబ్బా కొట్టారు.. ఏమైందని మాజీమంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao Thanneeru) ప్రశ్నించారు. ప్రజావాణి(Prajavani) దరఖాస్తులపై ఆర్టీఐ(RTI) ఇచ్చిన సమాచారాన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన.. ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. ప్రజా దర్బార్ ను జరపకపోగా పేరు మార్చి ప్రజావాణిని చేశారని, ముఖ్యమంత్రి రేవంత్(CM Revanth Reddy) కేవలం ఒకే ఒక్కరోజు హాజరై, 10 నిమిషాల పాటు మాత్రమే ప్రజల నుంచి వినతులు స్వీకరించారని, దీన్నిబట్టి ప్రజా దర్బార్ పట్ల ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఏపాటిదో తేటతెల్లమైపోయిందని దుయ్యబట్టారు. అలాగే మంత్రులు అందుబాటులో ఉంటారని మాట మార్చి, ఆ మాటా నిలబెట్టుకోలేదని, మంత్రులకు గాంధీభవన్ కు వెళ్లేందుకు ఉన్న తీరిక, ప్రజావాణికి రావడానికి మాత్రం ఉండటం లేదని, దీంతో ప్రజావాణి పట్ల మంత్రుల చిత్తశుద్ధి ఏపాటిదో కూడా తేటతెల్లమైపోయిందన్నారు.

ముఖ్యమంత్రీ రాక, మంత్రులూ రాక, చివరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో తూతూ మంత్రంగా ప్రజావాణి నిర్వహిస్తున్నారని, ప్రతినిత్యం నిర్వహిస్తామని మేనిఫెస్టోలో పేర్కొని, కడహీనంగా వారానికి రెండు రోజులు మాత్రమే నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఆ రెండు రోజుల ప్రజావాణికి రావడం, దరఖాస్తులు సమర్పించుకోవడం ఉత్త వృథా ప్రయాసే అవుతున్నదని జనం వాపోతున్నారని తెలిపారు. ప్రజావాణికి 2024 డిసెంబర్ 9 నాటికి 82 వేల 955 పిటిషన్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారని, అయితే అందులో కేవలం 43 వేల 272 పిటిషన్లు మాత్రమే గ్రీవెన్సెస్ కిందకు వస్తాయని మిగతావి గ్రీవెన్సెస్ పరిధిలోకి రావంటున్నట్లు చెప్పారు. గ్రీవెన్సెస్ కు సదరు అధికారులిస్తున్న నిర్వచనం ఏమిటంటే... ఫిర్యాదు, అన్యాయం, హక్కులకు భంగం, ప్రభుత్వ పథకాలు అందకపోవడం, అధికారులు వారి విధులు నిర్వహించకపోవడం, ప్రజలకు సిటిజన్ చార్టర్ ప్రకారం అందవలసిన సదుపాయాలు అందకపోవడం.. వీటినే గ్రీవెన్సెస్ కింద పరిగణిస్తామంటున్నారని వివరించారు. ఇక ఈ నిర్వచనం ప్రకారం భూ తగాదాలు గానీ, భూ నిర్వాసితుల సమస్యలు గానీ, నిరుద్యోగుల సమస్యలు గానీ, వివిధ వర్గాల పేదరిక సంబంధ సమస్యలు గానీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు మొదలైన విషయాలు గ్రీవెన్సెస్ కిందకు రావంటూ సగం దరఖాస్తులను అధికారులు తిరస్కరించారని ఆరోపించారు.

గ్రీవెన్స్ పరిధిలోకి రావని 50శాతం ప్రజావాణి పిటిషన్లను అధికారులు తిరస్కరించినట్లు ఆర్.టి.ఐ. కింద ఇచ్చిన సమాచారం ద్వారా వెల్లడైనట్లు తెలిపారు. ప్రజావాణికి వచ్చిన మొత్తం 82 వేల 955 పిటిషన్లలో.. గ్రీవెన్సెస్ గా గుర్తించినవి 43 వేల 272 మాత్రమేనని, వీటిని పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుందని, అట్లా పంపిన 43,272 గ్రెవెన్సులలో 27,215 మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయని చెబుతున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా 27,215 గ్రీవెన్సులు పరిష్కరించినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ అది నిజం కాదని, చాలా సమస్యలను పరిష్కరించకుండానే ఫైళ్లను క్లోజ్ చేశారని క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. సమస్య పరిష్కారం కాలేదని చెబుతున్నా వినిపించుకోకుండా, ఫైల్ క్లోజ్ చేశారని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రజావాణిలో తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఎంతో ఆశతో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి హైదరాబాద్ వరకు వస్తే, ఆశలు అడియాసలవుతున్నాయని, పడ్డ శ్రమ వృథా అవుతున్నదని ప్రజలు వాపోతున్నారని, కొండంత ఆశలు రేపి, గోరంత కూడా న్యాయం చేయక గోళ్లు గిల్లుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద సోకాల్డ్ ప్రజాపాలన ప్రజా పీడనగా మారిందని, ప్రజావాణి ఉత్త ప్రహసనం మాత్రమే అని తేలిపోయిందని, మేనిఫెస్టోలోని మొదటి హామీ నీటిమీది రాతగా మిగిలిపోయిందని హరీష్ రావు ఆరోపణలు చేశారు.

Tags:    

Similar News