సమంత, నాగార్జునపై తెలంగాణ BJP MP కీలక వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) వ్యాఖ్యలతో అక్కినేని నాగ చైతన్య, సమంత(Naga Chaitanya, Samantha) వివాకుల వ్యవహారం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.

Update: 2024-10-07 10:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) వ్యాఖ్యలతో అక్కినేని నాగ చైతన్య, సమంత(Naga Chaitanya, Samantha) విడాకుల వ్యవహారం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తెలుగు ఇండస్ట్రీ మొత్తం స్పందించి సమంతకు అండగా నిలిచారు. దీంతో మంత్రి కొండా సురేఖ సైతం మరోసారి స్పందించి.. సమంతకు క్షమాపణ చెప్పారు. తాను ఏ విషయంలో అయితే బాధపడుతున్నానో.. అదే అంశంలో మరో మహిళను బాధపెట్టానని భావించి.. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

తాజాగా.. నాగార్జున, సమంతపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత, నాగార్జునపై మాట్లాడారు. ‘అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ ఎఫ్టీఎల్‌లో ఉందని 2016లో ఎచ్‌ఎండీఏ రిపోర్ట్ ఇచ్చిందని, అప్పటి నుంచి ఎందుకు కూల్చలేదు. ఆ సమయంలో నాగార్జున కోడలుగా ఉన్న సమంత.. చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయ్యారు. అసలు ఆమెకు చేనేతరంగం గురించి ఏం తెలుసు. అప్పటి ప్రభుత్వానికి రంగుల లోకంతో ఉన్న రక్తసంబంధమేంటో చెప్పాలి’ అని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News