మంత్రి సీతక్క సమక్షంలో MP సోయం బాపురావు కీలక వ్యాఖ్యలు

నాగోబా జాతరలో కీలక ఘట్టమైన ప్రజా దర్బార్‌ను ఇవాళ నిర్వహించారు. ఈ దర్బార్‌లో మంత్రి సీతక్క, ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు.

Update: 2024-02-12 12:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: నాగోబా జాతరలో కీలక ఘట్టమైన ప్రజా దర్బార్‌ను ఇవాళ నిర్వహించారు. ఈ దర్బార్‌లో మంత్రి సీతక్క, ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోయం బాపురావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆదివాసీలపై అనవసర కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. అంతేకాదు.. పోడు భూములను పట్టాలు ఇవ్వకుండా మోసం చేసిందని గుర్తుచేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. ఇప్పుడైనా ఆదివాసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు కాంగ్రెస్ హయాంలో జరుగకుండా చూసుకోవాలని సూచించారు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్క ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. దేశం సమర్ధుడైన నాయకుడి చేతిలో ఉందని.. ప్రధాని నరేంద్ర మోడీ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. మరోసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వమే రాబోతోందని అన్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి మోడీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని అన్నారు.

Tags:    

Similar News