హౌసింగ్ కార్పొరేషన్ కు రూ.196 కోట్లు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రోడ్లు భవనాల శాఖ నుంచి తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థకు రూ. 196,46,13,413 ను విడుదల చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి డా.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రోడ్లు భవనాల శాఖ నుంచి తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థకు రూ. 196,46,13,413 ను విడుదల చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి డా. జ్యోతి బుద్ధ ప్రకాష్ జీవో జారీ చేశారు. ఈ మొత్తాన్ని డబుల్ బెడ్ రూం కాలనీల్లో నీటిసరఫరా, విద్యుదీకరణ, డ్రైయినేజీల కోసం వినియోగించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.