గ్రాడ్యుయేట్ MLC ఎన్నికపై KCR ఫోకస్.. రేపు వారితో కీలక సమావేశం

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక అందరి దృష్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై పడింది. ఎన్నికలో ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్, బీఆర్ఎస్‌, బీజేపీలు చూస్తున్నాయి.

Update: 2024-05-14 09:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక అందరి దృష్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై పడింది. ఎన్నికలో ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్, బీఆర్ఎస్‌, బీజేపీలు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ మూడు పార్టీలు అభ్యర్థులను సైతం ప్రకటించేశాయి. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి నుంచి బరిలోకి దిగారు. ఇండిపెండెంట్‌గా అశోక్(అశోక్ సర్) అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్.. ఎలాగైనా ఈ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని కాంగ్రెస్, నిరుద్యోగులు తమవైపే ఉన్నారని బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే గ్రాడ్యుయేట్‌పై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. స్వయంగా గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో మూడు జిల్లాల ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో రేపు(బుధవారం) ఉదయం భేటీ కానున్నారు. ఇప్పటికే ఒక్కరు కూడా మిస్సవ్వకూడదని కీలక నేతలకు సమాచారం ఇచ్చారు. ఈ భేటీలో తాజా రాజకీయాలపై కీలకంగా చర్చించనున్నారు.

Tags:    

Similar News