మద్యం మత్తులో రెచ్చిపోతున్న యువత.. కలకలం రేపుతున్న గ్యాంగ్ కల్చర్
గ్రామీణ ప్రాంతాల్లో గ్యాంగ్ కల్చర్ కలకలం రేపుతుంది.
దిశ,మానకోండూర్ : గ్రామీణ ప్రాంతాల్లో గ్యాంగ్ కల్చర్ కలకలం రేపుతుంది. మద్యం మత్తులో యువకులు సృష్టించే వీరంగం పల్లె జీవనానికి విఘాతం కలిగిస్తుంది. పండుగలు ప్రత్యేక వేడుకల్లో మద్యం మత్తులో యువకులు చేస్తున్న వికృత చేష్టలు గ్రామీణ ప్రాంతంలో ప్రశాంతవాతవరణానికి విఘాతం కల్గిస్తున్నాయి తాజాగా హోళీ వేడుకల్లో మానకొండూరు మండలం ఊటూర్ లో చోటు చేసుకున్న ఘటన గ్రామాల్లో గ్యాంగ్ వార్ కల్చర్ కు అద్దం పడుతుంది.
హోళీ వేడుకల్లో రంగులు చల్లుకుని రోజంతా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్న యువకులు సాయంత్రం సరదాగా మద్యం సేవించాలనుకున్నారు. అలా సరదాగా చేసుకున్న మద్యం వేడుక ఓ యువకుని పట్ల శాపంగా పరిణమించి ప్రాణాపాయ స్థితికి నెట్టేసింది. మద్యం మత్తులో సరదాగా మాట్లాడుకున్న మాటలు ఓ ఇద్దరి మధ్యలో అఘా దాన్ని సృష్టించిన ఇరువర్గాలు వారిని శాంతింప చేసాయి. దీంతో రెండు వర్గాలుగా విడిపోయి ఎవరి ఇళ్లలోకి వారు వెళ్లిపోయారు. అయితే అందులో ఒక్కరికి సన్నిహితుడిగా ఉండే పిట్టల శ్రీనివాస్ అనే వ్యక్తిని టార్గెట్ చేసిన యువకులు ఒంటరిగా వెళ్తున్న విషయాన్ని గమనించి ఆటో లో అపహరించి వ్యవసాయ పొలాల్లో కి తీసుకెళ్లి కట్టెలతో చితకబాదారు.
శ్రీనివాస్ సృహ తప్పి పడిపోవడంతో చనిపోయినట్టుగా గుర్తించి పొలం లో పడవేసి వెళ్లిపోయారు. తిరిగి ఆ యువకుడు నివసించే కాలనీకి మూడు ఆటోల్లో వెళ్లి కలియతిరగడం రండి రా అంటు రెచ్చిపోతు హల్చల్ చేయడంతో అనుమానం వచ్చిన స్థానికులు శ్రీనివాస్ కనపడకపోవడం తో కంగారు పడ్డ స్థానికులు శ్రీనివాస్ కు ఫోన్ చేయడం స్విచ్ ఆఫ్ అని సమాధానం రావడంతో అతడు వచ్చేవారిని వెతుక్కుంటూ వెళ్లిన స్థానికులు ఓ వ్యవసాయ పొలం వద్ద తన పాదరక్షలు దర్శనమివ్వడం తో అక్కడ చుట్టుపక్కల పరిశీలించగా సృహతప్పి పడిపోయి పోలంలో దర్శనమిచ్చాడు. దీంతో హడావిడిగా గ్రామస్తులు అతడిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దీంతో ప్రాణాపాయ స్థితి తప్పిన జరిగిన ఘటన మాత్రం కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతుంది.