కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం

రాబోవు రోజుల్లో శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

Update: 2025-03-20 14:09 GMT
కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం
  • whatsapp icon

దిశ, కొండగట్టు : రాబోవు రోజుల్లో శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కొండగట్టు గిరి ప్రదక్షణ చేస్తున్న భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారిని నాలుగు లక్షల రూపాయలతో ఆధునికరించడానికి గురువారం అటవీశాఖ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని అభివృద్ధిని కొండగట్టులో చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొడిమ్యాల రేంజ్ అధికారి గులాం మొయినుద్దీన్, డిప్యూటీ రేంజర్ మౌనిక, ముత్యం పేట బీట్ ఆఫీసర్ ప్రవీణ్, సిబ్బంది మహేందర్, నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, గోల్కొండ రాజు పాల్గొన్నారు. 


Similar News