ఆ షాపుల్లో ఆహార పదార్ధాలన్నీ అధ్వానం

నాణ్యత లేని స్వీట్స్ , బేకరీ షాప్ యజమానులకు నగరపాలక సంస్థ అధికారులు జెరిమానాలు విధించారు.

Update: 2025-03-21 13:53 GMT
ఆ షాపుల్లో ఆహార పదార్ధాలన్నీ అధ్వానం
  • whatsapp icon

దిశ, గోదావరిఖని : నాణ్యత లేని స్వీట్స్ , బేకరీ షాప్ యజమానులకు నగరపాలక సంస్థ అధికారులు జెరిమానాలు విధించారు. శుక్రవారం రామగుండం కార్పొరేషన్ లోని పలు బేకరీ, స్వీట్స్ షాపులను పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి నేతృత్వంలో రామగుండం నగర పాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం అధికారులు నగరంలోని బేకరీలు , స్వీట్ షాపులలో తనిఖీలు నిర్వహించారు.

     నాణ్యతా లోపంతో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్న ఒక బేకరీ, మరొక స్వీట్ షాపు నుండి రూ.20 వేలు జరిమానా విధించారు. అలాగే మరో బేకరీ నుంచి నిషేధిత ప్లాస్టిక్ సంచులను స్వాధీనం చేసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయించినా , నిషేధిత ప్లాస్టిక్ సంచులు వినియోగించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని నిర్వాహకులను హెచ్చరించారు. ఈ తనిఖీలలో శానిటరీ ఇన్స్పెక్టర్ నాగ భూషణం, ఎన్విరాన్మెంట్​ ఇంజనీర్ మధుకర్, ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. 


Similar News