Telangana: ‘ఠాగూర్’ సినిమా చూపిస్తున్నారు.. చికిత్సకు ఆస్తులు అమ్మే దుస్థితి: కేంద్ర మంత్రి

ఆస్తులు అమ్ముకున్న కూడా నేడు ఆసుప్రతి బిల్లులు చెల్లించలేని పరిస్థితి తెలంగాణలో ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.

Update: 2025-03-22 08:11 GMT
Telangana: ‘ఠాగూర్’ సినిమా చూపిస్తున్నారు.. చికిత్సకు ఆస్తులు అమ్మే దుస్థితి: కేంద్ర మంత్రి
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: ఆస్తులు అమ్ముకున్న కూడా నేడు ఆసుప్రతి బిల్లులు చెల్లించలేని పరిస్థితి తెలంగాణలో ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అభిప్రాయపడ్డారు. శనివారం కరీంనగర్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంప్ ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు. అన్ని రకాల టెస్టులు చేస్తారని, ఆ టెస్టులకే ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. అన్ని ఆసుపత్రులు అలా ఉండవని, కొన్ని ఆసుపత్రులు ఫ్రీ ట్రిట్‌మెంట్ లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాయని వివరించారు. తక్కువ బిల్లుతో చికిత్స చేసేవారు కూడా ఉన్నారని కొనియడారు. వైద్యులు దేవుళ్ల లాంటి వారని అన్నారు. హాస్పటల్స్‌పోతే చిన్న వ్యాధి అయిన కూడా ఒక భయానక వాతావరణం సృష్టించి.. ఠాగూర్ సినిమా తీరులో చూపించి.. ఆస్తి పాస్తులు అమ్ముకునేలా చేస్తున్నారని ఆరోపించారు. తన దగ్గరికి చాలా మంది పేద పేషంట్లు.. ఆస్పత్రిలో రూ. 20 లక్షల బిల్లు, రూ. 10 లక్షల బిల్లు అయిందని వస్తుంటారని అన్నారు. అయితే తగ్గించండి అని తాను మాట్లాడితే.. రూ. 5 వేలు, రూ. 10 వేలు తగ్గిస్తారని అన్నారు. దీంతో ఆసుపత్రి బిల్లులు కట్టాలంటే చందాలు వేసుకోవాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందన్నారు.

పేదలను ఆదుకోవడానికి గతంలో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం తీసుకు వచ్చిందన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే.. రూ.5 లక్షలు విలువ చేసే ట్రీట్‌మెంట్ ఈ దేశంలో ఎక్కడ పోయిన చేసుకోవచ్చని తెలిపారు. ఢిల్లీ, ముంబాయి, కరీంగనర్, హైదరాబాద్ ఎక్కడైనా చికిత్స చేయించుకోవచ్చని వెల్లడించారు. హెల్త్ సంబంధించిన అనేక ఇన్సూరెన్స్ పాలసీలు కేంద్రం తీసుకొచ్చిందన్నారు. అయితే తెలంగాణలో కూడా ఆయూష్మాన్ భారత్ నిక్కచ్చిగా అమలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎందుకంటే ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించక పోవడం వల్ల ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ కార్డు ఉన్న ట్రీట్‌మెంట్ చేయలేని పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టకపోవడం వల్ల, ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల ప్రవేటు ఆస్పత్రుల్లో ట్రిట్‌మెంట్ చేయడం లేదని, దీంతో పేదలు ప్రాణాలు కొల్పోయే పరిస్థితి తెలంగాణలో వచ్చిందన్నారు.

Tags:    

Similar News