విద్యార్థులకు అలర్ట్.. CUET UG దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) అండర్ గ్రాడ్యుయేట్-2025 దరఖాస్తు గడువు నేటితో(మార్చి 24) ముగియనుంది.

దిశ,వెబ్‌డెస్క్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) అండర్ గ్రాడ్యుయేట్-2025 దరఖాస్తు గడువు నేటితో(మార్చి 24) ముగియనుంది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులను సవరించుకునేందుకు NTA అవకాశం కల్పించింది. మే 8 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. సెంట్రల్, స్టేట్, ప్రైవేట్ వర్సిటీల్లో UG కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను CBT విధానంలో 13 భాషల్లో నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 22న ముగియాల్సి ఉండగా 24వ తేదీ వరకు పొడిగించారు.
గతంలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 18. కానీ విద్యార్థులు ఇతర వాటాదారుల నుంచి వచ్చిన అభ్యర్థనల ఆధారంగా దీనిని పొడిగించారు. ఇప్పటికే అప్లికేషన్ గడువు రెండు సార్లు పొడిగించినందున మళ్లీ పొడిగించే అవకాశం లేదు. కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు ఇప్పుడు ఇవాళ(సోమవారం) రాత్రి 11:50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు కనీసం 50% మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. SC/ST/OBC-NCL వర్గాలకు చెందిన అభ్యర్థులు తప్పనిసరిగా 45% మార్కులు పొందాలి. CUET UG 2025 కి ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కాకుండా, అభ్యర్థులు నేరుగా ఈ లింక్‌పై క్లిక్ చేయవచ్చు. https://cuet.nta.nic.in/ మెయిల్ ద్వారా మీరు CUET UG 2025 కి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.