TTD:డిగ్రీ కాలేజీల్లో DL ఉద్యోగాలు.. పరీక్ష తేదీలు ఖరారు

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని టీటీడీ (TTD) డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్‌(DL) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది.

Update: 2025-03-24 09:10 GMT
TTD:డిగ్రీ కాలేజీల్లో DL ఉద్యోగాలు.. పరీక్ష తేదీలు ఖరారు
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని టీటీడీ (TTD) డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్‌(DL) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. డిగ్రీ కాలేజీల్లో డీఎల్ ఉద్యోగాల భర్తీకి గత ఏడాది మార్చి 7వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తుల ప్రక్రియ మార్చి 7 నుంచి 27 వరకు కొనసాగింది. ఈ పోస్టులకు అన్‌లైన్‌లో అప్లై చేసుకున్న అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి. TTD కాలేజీల్లో మొత్తం 49 డిగ్రీ లెక్చరర్‌(Degree lecturer) పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన పరీక్ష తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://portal-psc.ap.gov.in/ద్వారా పరీక్ష తేదీలను పరీశిలించవచ్చు.

 

Tags:    

Similar News