రైతులకు గుడ్​ న్యూస్​..

వ్యవసాయ యాంత్రీకరణ ఉప పథకం (ఎస్ఎంఏ ఎం) కింద రైతులకు రాయితీపై వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు అందించేందుకు మహిళా రైతుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని హుజురాబాద్ సహాయ వ్యవసాయ సంచాలకులు సునీత తెలిపారు.

Update: 2025-03-20 11:30 GMT
రైతులకు గుడ్​ న్యూస్​..
  • whatsapp icon

దిశ, హుజురాబాద్ రూరల్ : వ్యవసాయ యాంత్రీకరణ ఉప పథకం (ఎస్ఎంఏ ఎం) కింద రైతులకు రాయితీపై వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు అందించేందుకు మహిళా రైతుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని హుజురాబాద్ సహాయ వ్యవసాయ సంచాలకులు సునీత తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 50 శాతం సబ్సిడీ పై ఇచ్చేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలు వచ్చాయన్నారు.

     హుజురాబాద్ డివిజన్ పరిధిలో హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్ మండలాల్లో బ్యాటరీ స్ప్రేయర్స్-32, పవర్ స్ప్రేయర్స్ -32, రోటావేటర్స్ -20 , (డిస్క్ హార్రోస్ ,కల్టివేటర్స్, ఎంబి ప్లవ్ ,కేజ్ వీల్స్)-22 తదితర పనిముట్లు రాయితీపై ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆసక్తి, అర్హత గల రైతులు వెంటనే దరఖాస్తుతో పాటు ఫొటో, కొత్త పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ జిరాక్స్, ట్రాక్టర్ తో పని చేసే యంత్రాలకు ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ పత్రాలు జత చేసి ఆయా మండల వ్యవసాయ కార్యాలయాల్లో అందజేయాలని కోరారు. 


Similar News