గంగపుత్రుల ఆర్థిక అభివృద్ధికి కృషి

గంగపుత్రుల ఆర్థిక అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.

Update: 2024-10-20 13:27 GMT

దిశ, జగిత్యాల టౌన్ : గంగపుత్రుల ఆర్థిక అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ చింతకుంట చెరువు వద్ద ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లా నియోజకవర్గంలో 155 చెరువుల్లో 20 లక్షల చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టామని, అలాగే చింతకుంట చెరువులో 2 లక్షల చేప పిల్లలను విడుదల చేసినట్టు తెలిపారు.

     ప్రభుత్వం గంగపుత్రుల ఆర్థిక అభివృద్ధికి, వారి సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. అలాగే రూ.20 లక్షలతో రైతు బజార్ లో చేపల మార్కెట్ అభివృద్ధి చేశామని తెలిపారు. రోడ్లపై మాంసం, చేపల విక్రయం ఆరోగ్యదాయకం కాదని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి, జిల్లా మత్స్య శాఖ అధికారి, మున్సిపల్ కమిషనర్ చిరంజీవి, గోలి శ్రీనివాస్, గిరి నాగభూషణం, ప్రవీణ్, గుమ్ముల అంజయ్య, గంగపుత్ర సంఘం సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News