వడగళ్లతో అన్నదాత విలవిల.. చేతికందిన పంట నేలపాలు
లక్షలు వెచ్చించి వేసిన పంటలు అకాల వర్షం తో రైతులకు తీరని నష్టాన్ని చేకూరుస్తున్నాయి.
దిశ రుద్రంగి: లక్షలు వెచ్చించి వేసిన పంటలు అకాల వర్షం తో రైతులకు తీరని నష్టాన్ని చేకూరుస్తున్నాయి. మండల కేంద్రంలో గంట పాటు కురిసిన వడగళ్ల వర్షానికి వరి, మిరప, టమాట, మామిడి తోటలు భారీగా దెబ్బతిన్నాయి. చేతికందిన పంట నేలకొరగడంతో అప్పు చేసి పంట సాగు చేసిన రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముఖ్యంగా వరి పంట ఇటు తెగులుతో పాటు రైతులకు అపార నష్టాన్ని చేకూర్చాయి. ఈ నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే అదుకొని నష్ట పరిహారం అందించాలని మండల రైతులు కోరుతున్నారు