ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది గుండు సున్నా : ఎమ్మెల్యే సంజయ్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యాడది గడుస్తున్న రాష్ట్రానికి
దిశ, కోరుట్ల రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యాడది గడుస్తున్న రాష్ట్రానికి చేసింది గుండు సున్నా అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణ, మండలానికి చెందిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సోమవారం చెక్కులు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో నాణ్యమైన కరెంట్, రైతు బీమా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని, కరోనా కష్ట కాలంలో సైతం డబ్బులు లేకపోయినా ఎలాంటి పథకాలు ఆపలేదన్నారు.
ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లోకి ధాన్యం తరలించిన ధాన్యం కొనేవాళ్ళు లేరన్నారని, సన్న వడ్లకు బోనాస్ కూడా లేదన్నారు. అనంతరం పట్టణ, మండలానికి చెందిన 189 మంది లబ్ధిదారులకు గాను రూ. ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షల ఇరవై ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరువై నాలుగు ల చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, మాజీ ఎంపీపీ తోట నారాయణ, నాయకులు సందయ్య, తుక్కయ్య, గడికొప్పుల గోపాల్,చెప్యాల నర్సయ్య, మిట్టపెల్లి రాజ శేఖర్, నూతిపెల్లి ముత్తయ్య, సుదవేణి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.