రైతుల ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రైతుల ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి

Update: 2024-11-18 12:01 GMT

దిశ, గంగాధర: రైతుల ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని అమ్మీ మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. గంగాధర మండలంలోని కురిక్యాల గ్రామంలో సోమవారం రోజున ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తప్ప, తాలు పేరుతో ఎక్కువ ధాన్యం తూకం వేయకుండా నిబంధనల మేరకే ధాన్యం తూకం వేయాలని, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించి ధాన్యం అమ్మిన రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి త్వరగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలని, ధాన్యం తీసుకోకుండా మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముత్యపు శంకర్, బైరిశెట్టి సంపత్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.


Similar News