ఈ పరిస్థితికి మోక్షమెప్పుడో..?

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తాప నగర్ గ్రామంలో

Update: 2024-11-18 10:13 GMT

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తాప నగర్ గ్రామంలో ని మండల పరిషత్ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలు, లో సరిపడా టాయిలెట్లు లేక విద్యార్థులు అత్యవసర సమయంలో ఉగ్గ పట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పాఠశాలల్లో విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్లు లేకపోవడంతో, క్యూలైన్లో నించుని అత్యవసరాలను తీర్చుకుంటున్నారు. మగ పిల్లలైతే సరిపడ టాయిలెట్స్ లేక స్కూల్ పక్కనే ఖాళీ స్థలంలో మూత్ర విసర్జన చేస్తున్నారు.

మూత్ర విసర్జనతో క్లాస్ రూమ్ లో కి గాలికి వాసన రావడంతో ముక్కులు మూసుకుంటున్నారు. దీంతో ఎవరికీ చెప్పుకునే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 126 మందికి ఒకటో, రెండో టాయిలెట్లు ఉంటున్నాయి. వాటిని కూడా శుభ్రం చేసేవారు లేక దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. దాంతో ముక్కు మూసుకుని విద్యార్థినులు టాయిలెట్‌ అవసరాలను తీర్చుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పిల్లలకు సరిపడ టాయిలెట్స్ రూములు కట్టేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


Similar News