రాజన్న ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు

పేదల దేవుడిగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన

Update: 2024-11-18 09:30 GMT

దిశ, వేములవాడ : పేదల దేవుడిగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.127.65 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ కాంప్లెక్స్ ల విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు ఉన్న రోడ్లును వెడల్పు చేసేందుకు రూ.47.85 కోట్లు, మూలవాగు లో ఉన్న బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు పైప్ లైన్, నూతన డ్రైనేజీ నిర్మాణానికి రూ.3.8 కోట్లు, ఇలా మొత్తం రూ.127 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం రాజన్న ఆలయానికి అభివృద్ధి కొరకు నిధులను మంజూరు చేయడం పట్ల వేములవాడ పట్టణ ప్రజలు రాజన్న భక్తులు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న ఆలయానికి ముహూర్దశ వచ్చినట్లేనని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో నిధుల మంజూరుకు కృషి చేసిన ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.


Similar News