కేంద్ర మంత్రి హోదాలో ఏం తెచ్చావ్

నిన్న జరిగిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో రాష్ట్రానికి ఏం నిధులు తెచ్చారో చెప్పాలని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ సాక్షిగా సవాలు విసిరారు.

Update: 2024-07-24 11:02 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : నిన్న జరిగిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో రాష్ట్రానికి ఏం నిధులు తెచ్చారో చెప్పాలని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ సాక్షిగా సవాలు విసిరారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ తీసుకురావాలని తాను, కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కి లేఖ రాశామని,

    దానికి తాను, నేత కార్మికులు ఈరోజు గుర్తొచ్చామా అని అన్నారు. నేత కార్మికుల సమస్యలపై లేఖ రాస్తే తప్పేంటని ప్రశ్నించారు. నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారి కుటుంబాలకు ఇప్పుడు ఏం సమాధానం ఇస్తారో చెప్పాలన్నారు. రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాకుండా వచ్చి కేంద్ర మంత్రులు మొహం ఎక్కడ పెట్టుకుని తిరుగుతారని పేర్కొన్నారు. మోడీ తెలంగాణ పట్ల, బండి సంజయ్ కరీంనగర్ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణకు వచ్చే నిధుల గురించి కేంద్రాన్ని నిలదీసి అడుగుతామని అన్నారు. 

Tags:    

Similar News