తెలంగాణ చౌక్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతాం: మంత్రి గంగుల
నగరంలోని చౌరస్తాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. నేడు తెలంగాణ చౌక్ లో ఐలాండ్ నిర్మాణ పనులను పరిశీలించారు.
దిశ, కరీంనగర్ టౌన్: నగరంలోని చౌరస్తాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. నేడు తెలంగాణ చౌక్ లో ఐలాండ్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల పనుల్లో నాణ్యతను పాటించాలని, నిర్ణీత గడువులోగా ఐలాండ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అధికారులతో కాసేపు ముచ్చటించి పనుల వివరాలు తెలుసుకున్నారు.
కరీంనగర్ లో జంక్షన్ల అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, ఈ పనులు పూర్తి అయిన వెంటనే ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇప్పటికే నగరంలోని కోర్టు, బస్టాండ్, కమాన్ చౌరస్తాలను సుందరంగా తీర్చిదిద్దామని, మిగతా చౌరస్తాలను కూడా సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారని తెలిపారు.
ముఖ్యంగా నగరంలోకి స్వాగ చౌరస్తా సుందరీకరణ పనుల కోసం రూ.6.50 కోట్లను కేటాయించి 13 చౌరస్తాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.