Former ZPTC : అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలన..

మండలంలోని ఇల్లు లేని నిజమైన నిరుపేదలకు ఇల్లు ఇవ్వడమే ఎమ్మెల్యే విజయరమణారావు లక్ష్యం అని మాజీ జెడ్పీటీసీ గోపగోని సారయ్య గౌడ్ అన్నారు.

Update: 2024-07-29 09:27 GMT

దిశ, కాల్వ శ్రీరాంపూర్ : మండలంలోని ఇల్లు లేని నిజమైన నిరుపేదలకు ఇల్లు ఇవ్వడమే ఎమ్మెల్యే విజయరమణారావు లక్ష్యం అని మాజీ జెడ్పీటీసీ గోపగోని సారయ్య గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో పాండవుల గుట్ట పై నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లను కాంగ్రెస్ నాయకులతో కలిసి సారయ్య గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 09 ఏండ్ల కాలంలో ఇండ్లులేని వారికి ఇంతవరకు ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదని అన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారుల పేర్లను ప్రకటించినా, ఇప్పటి వరకు ఎవరికి కూడా డబుల్ బెడ్ రూములు కేటాయించలేదని తెలిపారు. ఇప్పటి వరకు డబుల్ బెడ్ రూములు అసంపూర్తి నిర్మాణం కోసం ఎంత అయితే డబ్బులు ఖర్చు చేశారో, ఇప్పుడు అంతే ఖర్చు కాంగ్రెస్ ప్రభుత్వంలో వెచ్చించి పూర్తి నిర్మాణం చేయవలసిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇల్లు లేని వారందరికీ ఇండ్లు అందేలా చేస్తామని అన్నారు.

అందులో భాగంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆదేశాల ప్రకారం మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూములు పరిశీలించారన్నారు. సుమారు 240 వరకు ఉన్న ఈ డబుల్ బెడ్ రూములకు విద్యుత్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం, డ్రైనేజీ, కట్టిన డబుల్ బెడ్ రూమ్ లకు కిటికీలు, తలుపులు, మంచినీరు అందించేందుకు వాటర్ ట్యాంకు సీసీ రోడ్లు వేసి, మిగతా పనులు అన్ని చేయవలసి ఉందన్నారు. డబుల్ బెడ్ రూమ్ లలో ఉన్న అసౌకర్యాలను గుర్తించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి పూర్తిస్థాయిలో డబుల్ బెడ్ రూముల్లో సౌకర్యాలు కల్పించి నిరుపేదలకు ఇండ్లు ఇచ్చేందుకు ఎమ్మెల్యే సుముఖంగా ఉన్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యే ఈ అసౌకర్యాలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నిధులు మంజూరు చేసి డబుల్ బెడ్ రూమ్ లలో మిగిలి ఉన్న పనులు పూర్తి చేయించి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చేందుకు రూపకల్పన చేశారన్నారు. నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గాజనావేన సదయ్య, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మునీర్, మాదాసి సతీష్, పోట్యాల మొండయ్య, బంగారి రమేష్, గోలి సుధాకర్, కొంతం మధుకర్, రాణవేన క్రాంతి, తాండ్ర సురేష్, గోవర్ధన్, ప్రభాకర్, కాసర్ల మల్లన్న, ఎనగంటి నవీన్ జై, రవితేజ, రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు

Tags:    

Similar News